వాల్‌స్ట్రీట్‌లో అల్లకల్లోలం
గడచిన రెండేళ్ళ లాభాలు పోయాయి. ఐటీ, టెక్ షేర్లలో వచ్చిన ఒత్తిడి కారణంగా నాస్‌డాక్ రెండేళ్ళ కనిష్ఠ స్థాయిని తాకింది. యూరో మార్కెట్లు వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడి వాల్‌స్ట్రీట్‌లో కూడా కొనసాగింది. అన్ని రంగాలకు చెందిన షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా మూడు ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసిన తరవాత గూగుల్, మైక్రోసాఫ్ట్ ఫలితాలు ప్రకటించాయి. ఆ కంపెనీల ఫలితాలపై మార్కెట్‌కు పెద్ద ఆశలు లేకపోవడతో… రెండు షేర్లూ నాలుగు శాతంపైగా నష్టంతో ముగిశాయి. టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే… యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నాలుగు శాతం, అమెజాన్, ఎన్‌విడా, ఎంఎండీ అయిదు నుంచి ఆరు శాతం క్షీణించాయి. ఇక టెస్లా ఏకంగా 12 శాతంపైగా నష్టపోయింది. ఎకానమీ షేర్లలో కూడా ఒత్తిడి రావడంతో డౌజోన్స్ 2.38 శాతం, ఎస్ అండ్ పీ 500 2.8 శాతం, నాస్‌డాక్ 3.95 శాతం మేర నష్టపోయాయి.