80 శాతం షేర్లు నష్టాల్లో…
ఇవాళ మార్కెట్లో తీవ్ర ఒత్తిడి వచ్చింది.వరుసగా రెండో రోజు కూడా భారీ స్థాయిలో సూచీలు పడటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. చాలా మంది కొద్దిపాటి నష్టాలతోనైనా సరే బయటపడ్డారు. ఎందుకంటే ఈసారి కార్పొరేట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండనున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు అనేక వస్తువుల ధరలు పెరగడంతో కంపెనీల లాభదాయకత తీవ్రంగా దెబ్బతింది. డిమాండ్ కూడా తగ్గడంతో ఈనేసారి పలు కంపెనీలు స్థిర లేదా నష్టాలను ప్రకటించే అవకాశముంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా వంటనూనెల ధరలు,చైనాలో కరోనా అంశాలు మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. పైగా ఈసారి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా ఒకేలా ఉండటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ వర్షపాత నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను పెంచుతున్నాయి. గత శుక్రవారం, ఇవాళ అంటే రెండు సెషన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6 లక్షల కోట్లకు పైగా తగ్గింది. దాదాపు 80 శాతం షేర్లు నష్టాల్లో ముగిశాయంటే మార్కెట్లో ఏ స్థాయి భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఫ్యూచర్స్ 0.8 శాతం నష్టంతో ఉండటంతో… రేపు కూడా మార్కెట్ లాభాల్లో ప్రారంభమౌతుందా అన్నది అనుమానమే.