26 నుంచి క్యాంపస్ యాక్టివ్‌వేర్ IPO
క్యాంపస్ బ్రాండ్ కింద ఫుట్‌వేర్‌ను అమ్మే క్యాంపస్ యాక్టివ్‌వేర్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ ఇఫర్ 2న ముగుస్తుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.1400 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. షేరు ధరల శ్రేణిని రూ.278- 292గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 25 న ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇది పేరు పబ్లిక్ ఆఫర్ కాని… వాస్తవానికి ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్). అంటే కంపెనీలో ఇపుడు ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాలలో కొంత భాగాన్ని అమ్ముకుంటున్నారు. కంపెనీ ప్రమోటర్లు. ప్రస్తుత ఇన్వెస్టర్లు 4,79,50,000 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు . షేర్లు విక్రయించనున్న ప్రమోటర్లలో హరికృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్, ప్రస్తుత వాటాదార్లు టీపీజీ గ్రోత్ 3 ఎస్ఎఫ్ పీటీఈ, క్యూఆర్ ఎంటర్ప్రైజెస్, రాజీవ్ గోయల్, రాజేశ్ కుమార్ గుప్తా ఉన్నారు. ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 50 శాతం, రిటైల్ మదుపర్లకు 35 శాతం , సంస్థాగత మదుపర్లకు 15 శాతం కేటాయించారు. కనీసం 51 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. షేర్లు మే 9వ తేదీన స్టాక్ మార్కెట్‌లో లిస్టవుతాయి.