పెరిగితే 17225 వద్ద ప్రతిఘటన
మార్కెట్ ఇవాళ కాస్త గ్రీన్ కన్పిస్తోంది. ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే నిఫ్టికి 17225 వద్ద లేదా 17263 ప్రాంతంలో ప్రతిఘటన వస్తుందని డేటా అనిలిస్ట్ వీరేందర్ అంటున్నారు. ఈ స్థాయిని దాటితే 17300 దాటే అవకాశముందని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నందున 17055 వద్ద లేదా 16990 వద్ద నిఫ్టికి మద్దతు లభించే అవకాశముంది. మరింత ఒత్తిడి వచ్చే పక్షలో నిఫ్టి 16,900 ప్రాంతానికి చేరే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టికి మద్దతు లభిస్తే 16876 వద్ద తొలి ప్రతిఘటన వస్తుందని ఆయన అంటున్నారు. నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ నిఫ్టి పూర్తి లెవల్స్ కోసం వీడియో చూడండి.