For Money

Business News

17100 దిగువన నిఫ్టి

చూస్తుంటే నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయిని తాకినట్లుంది. ఐటీ, బ్యాంక్‌ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా కొద్దిసేపటి క్రితం నిఫ్టి 17092ని తాకింది. కాస్సేపట్లో యూరో మార్కెట్లు ప్రారంభం కానున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్‌ నామ మాత్రంగా ఉండటం, యూరో మార్కెట్‌ ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో…నిఫ్టి ఈ స్థాయి నుంచి కోలుకుంటుందేమో చూడాలి. అయితే ఫ్యూచర్స్ కేవలం ట్రెండ్‌ చూసేందుకే. ఎందుకంటే ఇవాళ యూరప్‌ మార్కెట్లకు ఈస్టర్‌ సెలవు. ఇన్ఫోసిస్‌ ఇవాళ 8శాతంపైగా నష్టపోగా, టెక్‌ మహీంద్రా, విప్రో కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ కూడా ఈ రెండు షేర్లు నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టితో పాటు నిఫ్టి బ్యాంక్‌ కూడా రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది.