For Money

Business News

నాస్‌డాక్‌ మళ్ళీ బాండ్‌ ఈల్డ్స్ షాక్‌

రెండు రోజులు తగ్గిన బాండ్‌ ఈల్డ్స్‌… ఒకే రోజు ఆ నష్టాన్ని భర్తి చేశాయి. ఇవాళ పదేళ్ళ బాండ్‌ ఈల్డ్ 4.29 శాతం పెరిగి 2.804కు చేరింది. మరోవైపు డాలర్‌ కూడా రెండు రోజుల నష్టాన్ని ఇవాళ భర్తీ చేసింది. 0.56 శాతం లాభపడిన డాలర్‌ ఇండెక్స్‌ 100.47 వద్ద ట్రేడవుతోంది. డౌజోన్స్ 0.15 శాతం లాభంతో, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.57 శాతం, నాస్‌డాక్‌ 1.3 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ అనేక బ్యాంకులు ఫలితాలు ప్రకటించాయి. ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించడంతో మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌ షేర్లు ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక గోల్డ్‌మన్‌ శాచ్స్‌ గ్రూప్‌ లాభం 43% శాతం తగ్గింది. అలాగే వెల్స్‌ ఫార్గో లాభం 21 శాతం తగ్గడంతో.. వీటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు యూరప్‌ మార్కెట్లన్నీ ఇవాళ లాభాలతో ముగిశాయి. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ మార్కెట్లన్నీ రేపు పనిచేయవు. ఇక మార్కెట్లు మళ్ళీ సోమవారం పనిచేస్తాయి.