ఊగిసలాటలో నిఫ్టి
ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్ సెషన్లోపలే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17663ని తాకిన నిఫ్టి తరవాత 17457 పాయింట్లకు అంటే 200 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 17509 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అయితే భారీ నష్టాలు మాత్రం కాదు. వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ కారణంగా ఇక్కడి నుంచి షార్ట్ కవరింగ్ వస్తుందేమో చూడాలి. లేదా నష్టాలతో ముగుస్తుందా అన్నది చూడాలి. వరుసగా నాలుగు రోజుల సెలవు తరవాత మార్కెట్లు ప్రారంభమవుతాయి. ఈలోగా ఐటీ షేర్లలో ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి జోరుగా ఉంది. బ్యాంక్ నిఫ్టి పరవాలేదు. సూచీలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బాగా దెబ్బతీస్తోంది. మెటల్స్ బాగానే ఉన్నాయి. ఫార్మా కోలుకుంటోంది.