For Money

Business News

17,550 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి 17550 దిగువన ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17,591ను తాకినా క్షణాల్లోనే నిఫ్టి 17,537ను తాకింది. ఇపుడు 17,577 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 97 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ కూడా నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ఉంది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌ షేర్లు. పేటీఎం. మార్కెట్‌ ట్రెండ్‌తో నిమిత్తం లేకుండా అదానీ గ్రూప్‌ షేర్లు 5 శాతం నుంచి 20 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ట్రెండ్‌కు భిన్నంగా పేటీఎం ఇవాళ కూడా మూడున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 0.88 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పోలిస్తే బ్యాంక్‌ నిఫ్టి కూడా అదే స్థాయి నష్టంతో ట్రేడవుతోంది. టీసీఎస్‌ ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే దివీస్‌ ల్యాబ్‌ కూడా టాప్‌ గెయినర్‌లో ఉంది.