For Money

Business News

NIFTY TRADE:17,610 కీలకం

మార్కెట్‌ చాలా బలహీనంగా ఉంది. అమెరికా సూచీలు 200 DEMAకి దిగువకు వచ్చినా.. మన మార్కెట్లు ఇవాళ 10 DMEAకి దిగువకు వస్తున్నాయని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. ఇక్కడి నుంచి 20 DMEA వైపు నిఫ్టి వెళుతోందని.. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి పెరిగితే షార్ట్‌ చేయొచ్చని.. అయితే 17610ని స్టాప్‌లాస్‌తో ఉంచుకోవాలని ఆయన కోరారు. 17610ని దాటితే నిఫ్టి పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేస్తుండగా.. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అందడం లేదని అంటున్నారు. డేటా ప్రకారం ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో షార్ట్‌వైపు వీరు ఉన్నారని పేర్కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అందడం లేదు. నిఫ్టికి 17543 లేదా 17490 వద్ద మద్దతు లభించవచ్చని.. అయితే ఇక నుంచి పడితే 17471ని చేరే అవకాశముందని వీరేందర్ అన్నారు. మొత్తం నిఫ్టి లెవల్స్‌ కోసం వీడియో చూడగలరు.