కుప్పకూలుతున్న షేర్ మార్కెట్లు
ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్లలో భారీ ఒత్తిడి వస్తోంది. డాలర్ ఇండెక్స్ 100ను దాటడంతో జనం మళ్ళీ సంప్రదాయక డిపాజిట్ల వైపు పరుగులు తీస్తున్నానరు. బాండ్ ఈల్డ్స్ ప్రతి రోజూ పెరగడం అమెరికా మార్కెట్లను కలవరపరుస్తోంది. ముఖ్యంగా పదేళ్ళ ప్రభుత్వ బాండ్స్‌పై ఈల్డ్స్ 2.83 శాతానికి చేరడంతో ఫైనాన్షియల్ మార్కెట్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అధికంగా, చాలా త్వరగా పెంచుతుందన్న అంచనాలు అధికమౌతున్నాయి. రాత్రి అమెరికా మార్కట్లలో అమ్మకాల జోరు ఏ స్థాయిలో ఉందంటే.. అన్ని రకాల షేర్లలోనూ ఒత్తిడి కన్పించింది. ముఖ్యంగా టెక్, ఐటీ షేర్లలో వస్తున్న అమ్మకాల వెల్లువ పెద్ద ఇన్వెస్టర్లను కూడా కలవరపరుస్తోంది. టెస్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అన్నీ రెండు శాతం నుంచి అయిదు శాతంలోపు నష్టపోయాయి. ఈ పతనం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతోంది. రాత్రి నాస్డాక రెండు శాతంపైగా పడింది. డౌజోన్స్1.19 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.69 శాతం క్షీణించింది.