కోలుకున్నా… నష్టాల్లోనే నిఫ్టి
నిఫ్టి ఉదయం నుంచి నష్టాల్లోనే ఉంది. మిడ్ సెషన్ సమయానికి కోలుకున్నా ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 17779ని తాకిన నిఫ్టి తరవాత 17653 పాయింట్లకు క్షీణించింది. దాదాపు 200 పాయింట్లు ఓఈణించిన నిఫ్టి సుమారు వంద పాయింట్లు కోలుకుంది. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌లో నుంచి నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి మళ్ళీ బలహీనపడింది. ప్రస్తుతం 17722 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో నిఫ్టి ప్రస్తుత స్థాయిలో కొనసాగడం అనుమానస్పదంగానే ఉంది. టీసీఎస్ ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది.