For Money

Business News

బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి రాజీనామా?

తన భార్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని బ్రిటన్‌ మీడియా రాస్తోంది. రిషి భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అయిన అక్షత మూర్తి ట్యాక్స్‌ లావాదేవీలకు సంబంధించి బ్రిటన్‌లో పెద్ద దుమారం రేగుతోంది.రిషి రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని సండే టైమ్స్‌ రాయగా, రాయిటర్స్‌ మాత్రం భిన్నమైన కథనం రాసింఇ. రాజీనామా చేసే యోచన రిషికి లేదని రాయిటర్స్‌ రాసింది. అక్షతకు ఇన్ఫోసిస్‌ కంపెనీలో 0.9 శాతం వాటా ఉంది. డివిడెండ్‌ రూపంలో ఆమెకు గత ఏడాది 1.512 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది. అయితే ఆమె ట్యాక్స్‌ రికార్డుల్లో నాన్‌డొమిసైల్డ్‌ స్టేటస్‌గా పేర్కొంది. అంటే బ్రిటన్‌ వెలుపల ఆమెకు వచ్చిన ఆదాయంపై ఆమె బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన పనిలేదు. తన భార్య ఇలాంటి మినహాయింపు కోరుతున్న సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి..ఉద్యోగులు, కార్మికులపై పన్ను ఎలా పెంచుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈనెల 6వ తేదీ నుంచి వీరిపై పన్నులు పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తరవాత బ్రిటన్‌లో కూడా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో అక్షతకు మినహాయింపు పొందున్న సమయలో… రిషికి పన్నులు వేసే నైతిక హక్కు ఉందా అని విపక్షలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే అక్షత కుటుంబ సభ్యులు విదేశాల్లో పలు కంపెనీలు నెలకొల్పారని, ఆ కంపెనీల్లో రిషికి కూడా వాటా ఉందని కూడా లేబర్‌ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను రిషి శుక్రవారం ఖండించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రిషి అధికార నివాసం ఖాళీ చేయడంపై కూడా వదంతులు వస్తున్నాయి. అయితే తమ పిల్లల స్కూలుగా దూరంగా ఉన్నందున… అధికార నివాసం ఖాళీ చేసినట్లు కూడా రిషి అనుకూల వర్గాలు అంటున్నాయి.