స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. వరుసగ మూడు రోజుల నుంచి భారీ నష్టాలతో ముగిసిన నాస్డాక్ రాత్రి నిలకడగా ముగిసింది. లాభాలు లేవు. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.43 శాతం పెరగ్గా, డౌజోన్స్ 0.25 శాతం లాభపడింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ మరింత పెరిగింది. అంతకుముందు యూరో మార్కెట్లు భారీ నష్టాల నుంచి స్వల్ప నష్టాలకు కోలుకుంది. ఇవాళ డాలర్ ఇండెక్స్ 100కు చేరుతుందేమో చూడాలి. మరోవైపు క్రూడ్ రాత్రి తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్ళీ 101 డాలర్లకు చేరింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ ఇవాళ కూడా నష్టాల్లో ఉంది. ఈ సూచీ 0.27 శాతం నష్టంతో ఉండగా, హాంగ్ సెంగ్ సూచీ 0.68 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లను అనుకరించే న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా సూచీ గ్రీన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి పది పాయింట్ల లాభంతో ఉంది. సో…నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.