For Money

Business News

దేశీయంగా తయారైన తొలివిమానం

దేశీయంగా తయారైన తొలి విమానం డోర్నియర్ 228 విమానాన్ని ప్రభుత్వరంగ అలయన్స్ ఎయిర్ కొనుగోలు చేసింది. తొలి విమానం డెలివరీ తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ప్రభుత్వరంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేస్తున్న 17 సీట్ల డోర్నియర్ 228 విమానాలు కొనుగోలు చేసేందుకు గత ఫిబ్రవరిలో అలయన్స్ ఎయిర్ ఒప్పందం చేసుకుంది. రాత్రి పూట ప్రయాణానికి కూడా ఈ విమానం అనువైనదని అలయన్స్‌ ఎయిర్‌ పేర్కొంది. ఇప్పటివరకు డోర్నియర్ విమానాలను సైనికుల అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు.