పదింటికి ఆర్బీఐ మీడియా సమావేశం
పరపతి విధానం ప్రకటించేందుకు ఇవాళ పది గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. మొన్నటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఇవాళ తన నిర్ణయాలను ప్రకటించనుంది. వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని మెజారిటీ బ్యాంకర్లు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకర స్థితిలో ఉన్నా… వృద్ధి రేటు దృష్ట్యా వడ్డీలను యధాతథ పరిస్థితి కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగినా… మళ్ళీ అవి తగ్గే అవకాశముంది. కాని ఇటీవల ఇవి బాగా పెరిగినందున ద్రవ్యోల్బణం పెరగడం ఖాయమని ఆర్బీఐ భావిస్తోంది. దీంతో ద్రవ్యోల్బణ టార్గెట్‌ను పెంచుతారా అన్నది చూడాలి.