For Money

Business News

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌ సమయానికి దాదాపు క్రితం ముగింపు స్థాయికి వచ్చిన నిఫ్టి… ఆ తరవాత కుప్ప కూలింది. ఆరంభంలో తడబడిన యూరో మార్కెట్లు … తరవాత ఆకర్షణీయ లాభాల్లోకి వచ్చినా… నిఫ్టి పట్టించుకోలేదు. 18000 కాల్ రైటింగ్‌ చాలా జోరుగా ఉండటం, పుట్‌ రైటింగ్‌ దాదాపు లేకుండా పోవడంతో… నిఫ్టి పతనం ఎక్కడా ఆగలేదు. స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో కాస్త పెరిగినట్లు కన్పించినా.. వెంటనే మళ్ళీ క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 168 పాయింట్ల నష్టంతో 17,639 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. సెన్సెక్స్‌ మరో 575 పాయింట్లు క్షీణించి 59034 వద్ద ముగిసింది. చిత్రంగా ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి పెద్దగా క్షీణించలేదు. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ తప్ప మిగిలిన బ్యాంకు షేర్లు లాభాల్లో ఉండటం. నిఫ్టి బ్యాంక్ కేవలం 0.2 శాతం నష్ణపోయింది. ఇవాళ మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా భారీ ఒత్తిడి వచ్చింది. ఇవాళ టాప్‌ గెయినర్స్‌గా యాక్సిస్‌ బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్‌ ఉండగా, టాప్‌ లూజర్స్‌గా అదానీ పోర్ట్స్‌, టైటాన్‌ నిలిచాయి.