నష్టాల్లో నిఫ్టి.. కాని
ట్రేడింగ్ చాలా వరకు నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ షేర్లకు పరిమితమైనట్లు కన్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. రూ. 1750 నుంచి రూ.,1528కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పడింది. నిఫ్టి బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన ఐటీ షేర్లలో భారీ ఒత్తిడి రావడంతో నిఫ్టి 74 పాయింట్ల నష్టంతో రూ. 17733 వద్ద ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లో 17,755ని తాకిన నిఫ్టి 17716ని తాకింది. అక్కడి నుంచి కోలుకుంది. క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్‌జీసీ టాప్ లూజర్ కాగా, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లోనే ఉన్నాయి. డాలర్ పెరగడంతో సిప్లా, దివీస్ ఫార్మా వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి నుంచి కోలుకుంటేదేమో చూడాలి.