For Money

Business News

పడితే కొనుగోలు చేయొచ్చు

అమెరికా మార్కెట్‌ స్థాయిలో మన మార్కెట్‌లో పతనం ఉండకపోవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ అంటున్నారు. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కాబట్టి హెచ్చుతగ్గులకు ఆస్కారముంది. 17850 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని షార్ట్‌ చేయొచ్చని, కాని మార్కెట్‌ పెరగడానికి సిద్ధంగా ఉందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. లాంగ్ పొజిషన్‌ తీసుకునేవారు 17500 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చని అన్నారు. ఫెడ్‌ అరశాతం వడ్డీ రేటును మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేశాయని.. వచ్చేవారం పెరిగేందుకు సూచీలు రెడీగా ఉన్నాయని అశ్విని అంటున్నారు. క్రూడ్‌ మరింత క్షీణించే పక్షంలో… మార్కెట్‌కు పాజిటివ్‌గా ఉంటుందని అన్నారు. బ్యాంక్‌ నిఫ్టి షార్ట్‌ చేసేవారు 38000 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని, అదే లాంగ్‌ పొజిషన్‌ తీసుకోవాలనుకుంటే 37000 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడ్‌ చేయమని ఆయన సలహా ఇచ్చారు.