120 పాయింట్ల నష్టంతో నిఫ్టి
దాదాపు సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17819ని తాకి ఇపుడు 17834 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి నిఫ్టి బ్యాంక్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఇవాళ కూడా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అలాగే కొటక్ బ్యాంక్ కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. ఇక లాభాల్లోఉన్న షేర్లలో కోల్ ఇండియా, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్ ఉన్నాయి. అదానీ విల్మర్ మళ్ళీ 4 శాతంపైగా లాభంతో పెరిగి రూ. 600 దాటింది. నిఫ్టి మిడ్ క్యాప్ మాత్రం స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది.