SBI Cards: బ్లాక్ డీల్ నేడు
ఎస్‌బీఐ కార్డ్స్ నుంచి కార్లి కంపెనీ వైదొలగనుంది. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్త కార్లికి 26 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను ఇవాళ అమ్మేయనుంది. ఆఫర్ ధర రూ.851.50 నుంచి రూ. 876.75 మధ్య ఉండనుంది. 2017లో ఈ వాటాను జీఈ గ్రూప్‌నుంచి కార్లి కొనుగోలు చేసింది. అపుడు రూ. 2000 కోట్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. ఇందులో సీఏ రోవర్ హల్డింగ్స్ పేరుతో 3.09 శాతం వాటా ఉంది. ఈ వాటాను ఇపుడు అమ్మేస్తోంది. ఈ డీల్ ద్వారా కనీసం రూ. 2558 కోట్లు వస్తాయని అంచనా. మార్కెట్‌లో షేర్ ధరకు 3 శాతం డిస్కౌంట్‌కు ఈ షేర్లను ఆఫర్ చేస్తున్నారు. సో… ఇవాళ ఎస్‌బీఐ కార్డ్స్ షేర్ కనీసం 3 శాతం పడే అవకాశముంది.