For Money

Business News

ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌కు 9.2 శాతం వాటా

తరచూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ముఖ్యంగా ట్విటర్‌ను విమర్శించే టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌… ట్విటర్‌ 9.2 శాతం వాటా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు నియంత్రణ సంస్థలకు తెలిపారు. ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సికి కూడా ఇపుడు ట్విటర్‌లో కేవలం 2 శాతం వాటా మాత్రమే ఉంది. కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని తనకు ఉందని గత ఏడాది మార్చిలో ఎలాన్‌ మస్క్‌ అన్నారు. క్రమంగా ట్విటర్‌ షేర్లను కొంటూ వచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించవచ్చు కదా అని ఓ వ్యక్తి ట్విటర్‌లో ఎలాన్ ప్రశ్నించాడు. అప్పటి నుంచి ఆయన సోషల్‌ మీడియా సంస్థ గురించి ఆలోచించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని తక్కువగా అంచనా వేస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండటం లేదని ఆయన ట్విటర్‌పై తరచూ ఆరోపిస్తూ వచ్చారు.