భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి
హెచ్‌డీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీన వార్తతో ఆరంభంలో మొదలైన ర్యాలీ చివరి దాకా కొనసాగింది. ఈ రెండు షేర్లతో పాటు హెడీఎఫ్‌సీ లైఫ్ షేర్లు భారీగా పెరగడంతో నిఫ్టి ఇవాళ 18053 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ సెషన్‌లో స్వల్ప వొత్తిడి వచ్చినా నిఫ్టి కోలుకుని ఏకంగా రెండు శాతంపైగా లాభంతో ముగిసింది. యూరో మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా.. మన మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. ఆరంభంలోనే నిఫ్టి 18114 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరింది. అక్కడి నుంచి 200 పాయిట్లు క్షీణించినా.. వెంటనే కోలుకుని 18053 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 383 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 1335 పాయింట్లు పెరిగి 60,000పైన ముగిసింది. 60611 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టికి డబుల్ అంటే 4 శాతం లాభంతో నిఫ్టి బ్యాంక్ ముగిసింది. నిఫ్టి ఫైనాన్షియల్స్ ఏకంగా 4.64 శాతం లాభంతో ముగిసింది. అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. నష్టాల్లో ఇన్ఫోసిస్ ముందుంది. ఈ షేర్ ఒక శాతం నష్టపోయింది. ఫార్మా షేర్లలో దివీస్ ల్యాబ్ 2.69 శాతం లాభంతో ముగిసింది.