NIFTY TRADE: పడితే కొనండి
నిఫ్టి ఇవాళ స్వల్పంగా క్షీణించే అవకాశముంది. ఒకవేళ పడితే..కొనుగోలుకు మంచి అవకాశంగా భావించాలని డేటా అనలిస్ట్ వీరందర్‌కుమార్ అంటున్నారు. నిఫ్టికి గతవారం నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే ప్రతికూల అంశాలు లేవు. విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్ళు మార్కెట్‌కు సానుకూల అంశంగా చెప్పొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోళ్ళు చేస్తున్నారు. గత శుక్రవారం ఎఫ్‌ఐఐలు భారీగా కొన్నారు. దీంతో మార్కెట్ ఏమాత్రం పడినా మద్దతు లభించే అవకాశముంది. ఇవాళ్టికి నిఫ్టి ఒకవేళ పడితే 17582 లేదా 17533 వద్ద మద్దతు లభించే అవకాశముంది. పెరిగితే 17749 వద్ద, ఆ తరవాత 17806 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. రిస్క్ వొద్దనుకునేవారు స్వల్ప లాభాలు స్వీకరించవచ్చని వీరందర్ సలహా ఇస్తున్నారు. ఇతర లెవల్స్ కోసం దిగువ వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=vDWeIL0DJM0&t=86s