క్యాపిటల్ మార్కెట్‌కు కె ఫిన్‌టెక్
జనరల్ అట్లాంటిక్‌కు మెజారిటీ వాటా ఉన్న కె ఫిన్ టెక్నాలజీస్ లిమిట్ క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. పబ్లిక్ ఇష్యూ కోసం ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. మార్కెట్ నుంచి రూ. 2400 కోట్లు వసూలు చేయాలని అనుకుంటోంది. ఈ ఇష్యూలో కొత్త షేర్ల జారీ ఉండదు. ఉన్న ఇన్వెస్టర్లే తమ వాటాను ఇన్వెస్టర్లకు అమ్ముతున్నారు. ఈ కంపెనీలో 74.95 శాతం వాటా ఉన్న జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. ఈ కంపెనీలో కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు కూడా 9.98 శాతం వాటా ఉంది. 2021లో ఈ డీల్ కుదిరింది. మ్యూచువల్ ఫండ్స్‌కు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌్, వెల్త్ మేనేజర్స్, పెన్షన్ ఫండ్స్ సొల్యూషన్స్‌ను అందించడమే గాక.. ఇన్వెస్టర్‌గా ఈ కంపెనీ పనిచేస్తోంది.