For Money

Business News

ఈ మూడు షేర్లూ… కొనొచ్చు

మార్కెట్‌ చాలా బలంగా ముందుకు సాగుతోంది. అక్కడక్కడ చిన్న కుదుపులు ఉన్నా… 18,000 వైపు పయనిస్తున్నట్లుగా కన్పిస్తోంది. ఇప్పటికే 17500 స్థాయిని అందుకున్న నిఫ్టి మరింత ముందుకు సాగుతుందని అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా అంటున్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకుల కోసం ఆయన వచ్చే వారినికి మూడు షేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఆయన ప్రతిపాదనలు చదవండి. కాని ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్‌ నిపుణులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోంది. ఇది కేవలం ఆయన అభిప్రాయాలను ముందుకు ఉంచే ప్రయత్నమే.
కునాల్‌ ప్రతిపాదించిన తొలి షేర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. ఈ షేర్‌ పది రోజుల క్రితం రూ.1407ని తాకింది. గత శుక్రవారం రూ. 1507 వద్ద క్లోజైంది.ఈ షేర్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ బ్యాంక్‌ ఈ సారి అద్భుత ఫలితాలను ప్రకటిస్తుందని ఇప్పటికే మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 1700 టార్గెట్‌ కోసం రూ. 1440 స్టాప్‌లాస్‌గా ట్రేడ్‌ చేయమని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టిపై ఈ షేర్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్‌ నిఫ్టిని నడిపించే షేర్‌ ఇది. ఇక కునాల్ సిఫారసు చేసిన రెండో షేర్‌ ఐటీసీ. గత శుక్రవారం ఈ షేర్‌ రూ. 255 వద్ద ముగిసింది. రూ. 275 టార్గెట్‌ కోసం రూ. 245 స్టాప్‌లాస్‌తో ఐటీసీని కొనుగోలు చేయొచ్చని ఈయన సలహా ఇస్తున్నారు. ఇక మూడో షేర్‌ BHEL. ఈ షేర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ బాస్కెట్‌లో బాగా రాణించింది. శుక్రవారం ఈ షేర్‌ 9శాతం పైగా లాభంతో రూ. 53.80 వద్ద ముగిసింది. ఈ షేర్‌ను రూ.50 స్టాప్‌లాస్‌తో రూ. 60 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని కునాల్‌ సలహా ఇస్తున్నారు.
(వివిధ అనలిస్టుల అభిప్రాయం మీ ముందు ఉంచే ప్రయత్నం ఇది. కొనుగోలు చేయమని సలహా మాత్రం కాదు)