For Money

Business News

అమెజాన్‌: యూనియన్‌కు కార్మికుల ఓటు

ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన అమెజాన్‌ సంస్థలో వర్కర్స్‌ యూనియన్‌ ఏర్పడింది. యూనియన్‌ ఉండాలా?వద్ద అన్న అంశంపై జరగిన ఓటింగ్‌ లో 55 శాతం మంది కార్మికులు యూనియన్‌వైపు మొగ్గు చూపారు. న్యూయార్క్‌లోని కంపెనీ వేర్‌హౌస్‌ వర్కర్స్‌ ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్‌లో 2,654 మంది కార్మిక సంఘం ఉండాలని ఓటు వేయంగా అక్కర్లేలేదని 2131 మంది అంటే 45 శాతం మంది కార్మికులు ఓటు వేశారు. ఫెడరల్‌ లేబర్‌ అధికారుల సమక్షంలో ఈ ఓటింగ్‌ జరిగింది. ఇరు పక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ఏప్రిల్‌ 8న ఎన్నికల తుది ఫలితాలను ప్రకటిస్తామని ఫెడరల్ లేబర్‌ అధికారులు తెలిపారు. యూనియన్‌ ఉన్నా, లేకున్నా కార్మికుల పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని అమెజాన్‌ పేర్కొంది.