ఇవాళ విమానాల పెట్రోల్ వంతు
సాధారణ ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్ ధరలను ఇవాళ పెంచలేదు. అయితే విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫూయల్ (ATF) ధరలను పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. తాజాగా 2 శాతం పెంచాయి. ఈ ఏడాది ఈ పెట్రోల్ ధర పెంచడం ఏడవ సారి. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కిలో లీటర్ ఏటీఎఫ్ ధరను రూ. 2258.54 పెంచడంతో… ఢిల్లీలో ధర రూ. 1,12,924.83లకు చేరింది. ప్రతి 15 రోజలకు ఒకసారి ధరలను పెంచుతూ వస్తున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏటీఎఫ్ ధరలు 50 శాతం పెరిగాయి. విమానాలు నడిపేందుకు అయ్యే ఖర్చులో ఇంధన ఖర్చు 40 శాతం దాకా ఉంటుంది. ఇపుడు పూర్తి స్థాయిలోవిమాన సర్వీసులు నడిపే సమయంలో ఏటీఎఫ్ ధరలు భారీగా పెంచడంతో విమానయాన కంపెనీలు లబోదిబో మంటున్నాయి. ఇపుడిపుడే జనం విమానాలు ఎక్కుతున్న సమయంలో ఈ స్థాయిలో ఏటీఎఫ్ ధరలు పెరగడంతో… కంపెనీల లాభదాయకత పై ప్రభావం అధికంగా ఉంటుంది.