For Money

Business News

ఆరు రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌… రూ. 672 కోట్లు

విడుదలైన ఆరు రోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 672.16 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. ఈ వారంలోనే రూ. 700 కోట్ల క్లబ్‌లో చేరనుంది. 2015లో వచ్చిన బాహుబలి కలెక్షన్స్‌ను ఆర్ఆర్‌ఆర్‌ దాటింది. వారం ప్రారంభం నుంచి కాస్త మందగించిన కలెక్షన్స్‌ శుక్రవారం నుంచి పుంజుకుంటాయని ట్రేడ్‌ అనలిస్టులు అంటున్నారు. బుధవారం కూడా ఈ సినిమా రూ. 50.74 కోట్ల కలెక్షన్‌ను సాధించింది. అమెరికాలో కలెక్షన్స్‌ హోరు తగ్గడం లేదు. హిందీ వెర్షన్‌ కలెక్షన్స్‌ కూడా నిలకడగా సాగుతున్నాయి. శుక్రవారం జాన్‌ అబ్రహాం నటించిన ‘అటాక్‌’ సినిమా విడుదల కానుంది. దీంతో రేపటి ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ జోనర్‌ వేరని, ఈ సినిమా కలెక్షన్స్‌ను పెరుగుతాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.