స్థిరంగా ముగిసిన నిఫ్టి
ఉదయం నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి చివరికి స్థిరంగా ముగిసింది. ఉదయం భారీ లాభాలతో 17559 స్థాయిని తాకిన నిఫ్టి మిడ్ సెషన్ కల్లా నష్టాల్లోకి జారుకుంది. 17460 ప్రాంతానికి పడినా యూరప్ మార్కెట్‌పై ఆశలతో కోలుకుంది. యూరప్ మార్కెట్ ఆరంభంలో స్వల్ప లాభంతో ఉంది. అప్పటి వరకు గ్రీన్‌లో నిఫ్టి… యూరో మార్కెట్లతో పాటు నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17435కి పడినా.. తరవాత స్వల్పంగా కోలుకుని 17,464 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 33 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి, నిఫ్టి ఫైనాన్షియల్స్ సూచీలు స్వల్ప నష్టంతో క్లోజ్ కాగా, నిఫ్టి మిడ్ క్యాప్ గ్రీన్‌లో క్లోజైంది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి బ్యాంక్ స్వల్ప లాభంతో ముగిశాయి. మెటల్స్‌లో భిన్న ధోరణి కన్పించింది. స్టీల్ షేర్లు లాభాలతో క్లోజ్ కాగా, హిందాల్కో నష్టాల్లో ముగిసింది. హిందాల్కో తరవాత దివీస్ ల్యాబ్ భారీ నష్టంతో ముగియడం విశేషం. ఒకదశలో రూ. 4400 దిగువకు వెళ్ళిన ఈ షేర్ తరవాత కోలుకుని రూ.4424 వద్ద ముగిసింది.