రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి
మిడ్ సెషన్‌లో కాస్త ఒత్తిడి వచ్చినా… ఇవాళ రోజంతా నిఫ్టి గ్రీన్‌లో ఉంది. ఉదయం ఆరంభంలోనే 17,387 పాయింట్లకు చేరిన నిఫ్టి…దాదాపు 250 పాయింట్లు నిఫ్టి పెరిగింది. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి 17522 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 173 పాయింట్ల లాభంతో 17498 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. రెండు గంటల తరవాత వచ్చిన షార్ట్ కవరింగ్‌తో షేర్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ నిఫ్టి బ్యాంక్ 1.36 శాతం లాభపడింది. నిఫ్టి ఫైనాన్షియల్స్ రెండు శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్ మాత్రం అర శాతం లాభపడింది. నిఫ్టి మిడ్ క్యాప్‌లో రామ్‌కో సిమెంట్ టాప్‌లో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఇటీవల ఆకర్షణీయ లాభాలతో ఉన్న మెటల్స్ ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా స్టీల్ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది.