భారీ లాభంతో SGX NIFTY
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయన్న వార్తలతో ప్రపంచ ఈక్విటీ మార్కట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నాస్డాక్ 1.84 శాతం పెరిగింది. ఆరంభంలో ఒక మోస్తరు లాభాలతో ఉన్న నాస్డాక్ క్రమంగా పుంజుకుంటూ ఆకర్షణీయ లాభాలు గడించింది. యాపిల్ వంటి షేర్లకు ప్రస్తుత ధరలోనూ భారీ మద్దతు అందుతోంది. ఎస్ అండ్ పీ కూడా 1.23 శాతం లాభపడింది. ఇక డౌజోన్స్ 0.97 శాతం లాభపడింది. క్రూడ్ కూడా రాత్రి బాగా క్షీణించడంతో ఆసియా మార్కెట్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒక్కటే 0.78 శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ సూచీ 1.71 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 170 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిన్న రాత్రి 370 పాయింట్ల లాభంతో ఉంది.