17,300పైన ముగిసిన నిఫ్టి
రోజంతా గ్రీన్లో ట్రేడైన నిఫ్టి మిడ్ సెషన్ సమయంలో కాస్త ఒత్తిడికి లోనైంది. యూరో ఫ్యూచర్స్ చాలా స్వల్ప లాభాలతో ఉండటంతో యూరో మార్కెట్ ఓపెనింగ్ సమయంలో ఒత్తిడి వచ్చింది. ఫ్యూచర్స్కు భిన్నంగా భారీ లాభాలతో యూరో మార్కెట్లు ప్రారంభం కావడంతోనిఫ్టి క్రమంగా పెరుగుతూ 17,343ని తాకింది. తరవాత 17,325 పాయింట్ల వద్ద ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 103 పాయింట్లు లాభపడింది. యూరో మార్కెట్లు రెండు శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆ లాభాలతో పోలిస్తే మన నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ముగిసిందని చెప్పాలి. హీరో మోటోకాప్ కంపెనీపై జరిగిన ఐటీ దాడుల వార్తల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లో తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఒక దశలో 10 శాతం క్షీణించిన షేర్ ఎట్టకేలకు 6.6 శాతం నష్టంతో ముగిసింది. లేకుంటే నిఫ్టి మరిన్ని లాభాలతో ముగిసేది. నిఫ్టిలో 32 షేర్లు లాభాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు 0.4 శాతంకన్నా అధిక లాభాలతో ముగిశాయి. ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల కారణంగా నిఫ్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ ఒక శాతంపైగా లాభపడింది.