For Money

Business News

రేపటి నుంచి హరిఓమ్‌ పబ్లిక్‌ ఇష్యూ

హైదరాబాద్‌కు చెందిన హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 5న ఆఫర్‌ ముగుస్తుంది. షేర్ల అలాట్‌ మెంట్‌ 8న జరుగుతుంది, 13న షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అవుతాయి. మార్కెట్‌ నుంచి రూ.120 కోట్ల సమీకరణకు కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.144-153గా నిర్ణయించింది. కనీసం 98 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. ఇష్యూలో భాగంగా మొత్తం 85 లక్షల షేర్లను జారీ చేస్తోంది. ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో రూ.40 కోట్లను కంపెనీ నిర్వహణకు ఉపయోగించనుంది. హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ స్టీల్‌ పైపులను తయారు చేసి దక్షిణాది రాష్ట్రాల్లో విక్రయిస్తోంది. గత ఏడాది మార్చి నెలతో ముగిసిన ఏడాదిలో రూ. 254 కోట్ల టర్నోవర్‌పై రూ. 15.13 కోట్ల నికర లాభం ఆర్జించింది.