కేంద్రం అప్పులు రూ.128 లక్షల కోట్లు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పులు చేయడంలో రాష్ట్రాలతో పోటీ పడుతోంది. గత డిసెంబర్ నెలాఖరుకు కేంద్రం అప్పుల మొత్తం రూ.128.41 లక్షల కోట్లకు (కరెక్ట్‌గా చెప్పాలంటే రూ. 1,28,41,996 కోట్లు) చేరింది. గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరున కేంద్రం చేసిన రుణాల మొత్తం రూ. 125.71 కోట్లు (రూ. 1,25,71,747 కోట్లు) ఉండేది. కేంద్రం అప్పుల్లో ప్రజా రుణం 91.60 శాతం ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం చేసిన అప్పుల్లో దాదాపు 25 శాతం అప్పు వచ్చే అయిదేళ్ళలోపు తీర్చాల్సిన ఉండటం విశేషం. కేంద్రం తెచ్చిన అప్పుల్లో రికార్డు స్థాయిలో 35.40 శాతం అప్పులు వాణిజ్య బ్యాంకుల నుంచి తెచ్చింది కాగా, బీమా కంపెనీల నుంచి 25.74 శాతం అప్పులు తెచ్చింది. ఇక ప్రావిడెంట్ పండ్ నుంచి కూడా తెచ్చిన అప్పలు మొత్తం రుణాల్లో 4.33 శాతం ఉన్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్ల నుంచి సమీకరించిన రుణాలు 3.08 శాతమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు 16.92 శాతం.
రుణాలు రెట్టింపు
మోడీ ప్రభుత్వం అధికారంలో రాకముందు అంటే 2014 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాల మొత్తం రూ. 56,69,128.48 కోట్లు. ఇందులో విదేశీ రుణం రూ. 1,84,580.74 కోట్లు కాగా పబ్లిక్ డెట్ రూ. 44,25,347.66 కోట్లు. మోడీ అధికారంలోకి వచ్చాక… గత డిసెంబర్ నాటికి రూ. 56.69 లక్షల కోట్ల అప్పు కాస్త రూ.128,41 లక్షల కోట్లకు చేరింది.