For Money

Business News

తప్పదు…ఫ్లాట్ల ధరలను పెంచాం

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఇప్పట్లో ఇది తగ్గదని గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈఓ మోహిత్‌ మల్హోత్రా అన్నారు. జనవరి నుంచే తాము తమ ప్రాజెక్టు దరలను నాలుగు నుంచి ఎనిమిది శాతం పెంచామని అన్నారు. అలాగే ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగినందున తాము కూడా కాస్త మార్జిన్‌ తగ్గించుకున్నామని ఆయన చెప్పారు. బెంగళూరులో తాము చేపట్టిన 30 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టు చేపట్టామని.. ఈ ప్రాజెక్టు నుంచి రూ. 1000 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది చాలా వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్టు అని ఆయన అన్నారు. స్టీల్, అల్యూమినియం ధరలు 30 శాతం నుంచి 40 శాతం పెరిగాయని ఆయన అన్నారు. దీర్ఘకాలంలో ఈ ధరలు కొనసాగకపోవచ్చని అన్నారు. అయినా తమ ప్రాజెక్టులకు మంచి డిమాండ్‌ వస్తోందని ఆయన అన్నారు. ప్రజల ఆదాయం కూడా పది శాతంపైనే పెరుగుతోందని… కాబట్టి కాస్త ధర ఎక్కువైనా ప్రాజెక్టులకు డిమాండ్‌ తగ్గడం లేదన్నారు. అందువల్లే రెసిడెన్షియల్ డిమాండ్‌ తగ్గడం లేదన్నారు. కొత్త ప్రాంతాల్లో కూడా తాము విస్తరిస్తున్నామని అన్నారు. హర్యానాలోని సోనిపట్‌లో చేపట్టిన 50 ఎకరాల ప్రాజెక్టు కూడా మంచి ఆదాయం తెచ్చే ప్రాజెక్టు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 750 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.