మన కంపెనీల విదేశీ లిస్టింగ్ లేనట్లే
ఇక మన దేశీయ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్ట్ కావొచ్చని… అక్కడ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించవచ్చని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఫిబ్రవరి కల్లా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను కూడా ప్రకటిస్తానని చెప్పింది. అయితే ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అలా చేయడం బదులు దేశీయ క్యాపిటల్ మార్కెట్‌నే అభివృద్ధి చేయాలని బావిస్తున్నట్లు మన అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయమై వివరణ ఇవ్వడానికి ఆర్థిక శాఖ స్పందించ లేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు కూడా నిరాశచెందినట్లు రాయిటర్స్ పేర్కొంది.