For Money

Business News

నష్టాల్లోకి జారుకున్నా…

నిఫ్టి ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఉదయం లాభాలన్నీ 10.30కల్లా పోయాయి. నిఫ్టి నష్టాల్లోకి వచ్చింది. వెంటనే లాభాల్లోకి వచ్చినా… ఎక్కువసేపు నిలబడలేదు.12 గంటలకల్లా నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ 17215 పాయింట్లకు చేరింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి ప్రస్తుతం 17,259 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరోపియన్‌ షేర్లు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఆకర్షణీయ లాభాలతో ముగిసిన యూరో మార్కెట్లు ఓపెనింగ్‌లో గ్రీన్‌లో ఉన్నా… పెద్ద మార్పు లేదు. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.04 శాతం నష్టంతో ఉంది. యూరప్ మార్కెట్లు ఉత్సాహంగా లేకపోయేసరికి నిఫ్టి 17286 నుంచి స్వల్పంగా తగ్గింది. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు ఉన్నందున… నిఫ్టి ఎలా ముగుస్తుందో చూడాలి.