For Money

Business News

నాస్‌డాక్‌తో పాటు ఆలీబాబ్‌ జిగేల్‌

యూరో మార్కెట్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా ఆరంభంలో మంచి లాభాలు సాధించాయి. ముఖ్యంగా బ్యాంక్‌ షేర్లలో మద్దతు కన్పించింది. ఇక ఐటీ, టెక్‌ షేర్లలో వచ్చిన భారీ ర్యాలీ కారణంగా నాస్‌డాక్‌ 1.85 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీలోని 11 ప్రధాన రంగాల్లో 9 రంగాల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 3.4 శాతం లాభం పొందింది. వెల్స్‌ ఫార్గో షేర్‌ 5.2 శాతం పెరగ్గా, పదేళ్ళ ట్రేజరీ ఈల్డ్‌ 2.36 శాతానికి చేరింది. 2019 మే తరవాత ఈస్థాయికి ఈల్డ్స్‌ పెరగడం ఇదే మొదటిసారి. మేనెలలో జరిగే మీటింగ్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 0.5 శాతం మేర వడ్డీ రేటు పెంచుతారని మెజారిటీ అనలిస్టలు భావిస్తున్నారు. ఇక టెక్‌ షేర్లలో యాపిల్, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ షేర్లు అర శాతం నుంచి ఒక శాతం వరకు లాభపడ్డాయి.చాలా రోజుల తరవాత ఆలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ షేర్‌ 10.5 శాతం పెరిగింది. షేర్ల బైబ్యాక్‌ కోసం 2500 కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.