ఇంటి గ్యాస్ ధర పెంపు
పెట్రోల్, డీజిల్‌తోపాటు ఇవాళ్టి నుంచి గృహ వినియోగ గ్యాస్ ధరలను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సిలెండర్ ధరను రూ.50 పెంచాయి. ఢిల్లీలో గ్యాస్ ధర రూ. 899.50 నుంచి రూ.949.5కి పెరిగింది. గత ఏడాది అక్టోబర్ 6వ తేదీ తరవాత ఇంటి గ్యాస్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. ఢిల్లీలో రూ.949కు పెరిగింది. ఇది వరకు ఇక్కడ సిలిండర్ ధర రూ.899గా ఉండేది. అలాగే కోల్‌కతాలో అయితే సిలిండర్ ధర రూ.926గా ఉండేది. ఇప్పుడు ఈ రేటు రూ.976కు ఎగసింది. అలాగే లక్నోలో కూడా సిలిండర్ ధర పైకి చేరింది. రూ.938 నుంచి రూ.987కు చేరింది. అలాగే పాట్నాలో కూడా సిలిండర్ ధర రూ.998 నుంచి రూ.1039కు చేరింది.