For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌… తగ్గేదేలే!

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ప్రపంచ ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం తరవాత ఉక్రెయిన్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారు కాగా, రష్యా పరిస్థితి అంతకన్నా దారుణంగా కాని. ఈ యుద్ధంతో సంబంధంలేని ప్రపంచ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి రకరకాల ఖనిజాల ధరలు రెట్టింపు అయ్యాయి. ఇక క్రూడ్‌ ధరల సంగతి చెప్పనక్కర్లేదు. మొన్న 130 డాలర్లకు చేరిన క్రూడ్‌ … తరవాత 100 డాలర్లకు దిగువకు చేరింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరాదని యూరోపియన్‌ దేశాలు భావిస్తున్నాయి. దీనిపై ఈవారంలో తుది నిర్ణయం తీసుకోనున్నాయి. దీంతో క్రూడ్‌ ధరలు జెట్‌ స్పీడ్‌తో పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ 119 డాలర్లకు చేరగా, WTI క్రూడ్‌ ధరలు 115 డాలర్లకు చేరాయి. మరోవైపు వివిధ దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం భారీగా పెరగడంతో… క్రూడ్‌ ధరలు ఇంకా పెరుగుతుందేమోనన్న టెన్షన్‌ మార్కెట్‌లో నెలకొంది.