For Money

Business News

ర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ ఖర్చే రూ. 336 కోట్లు!

టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించాలని RRR సినిమా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…. జీఎస్టీ, హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ.336 కోట్లు ఖర్చు అయినట్లు నిర్మాణ సంస్థ తెలిపిందని, వాటికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. జీఎస్టీ డిపార్ట్‌మెంట్. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, హోం సెక్రటరీలు ఆ వివరాలపై స్క్రూటినీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్తుందని, నిర్మాణం చేసిన వ్యయానికి ఎంతవరకూ అదనంగా రేటు ఇవ్వొచ్చనేది పరిశీలించి జీవో విడుదల చేస్తుందని వెల్లండిచారు.

మార్చి 7వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 13 ద్వారా సినిమా థియేటర్లలో ఏ ఏ ప్రదేశాల్లో ఏ సినిమా హాళ్లలో రేట్లు ఎలా ఉండాలని టిక్కెట్ రేట్ల ఫిక్స్ చేసి జీవోలో పొందుపర్చడం జరిగిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా హీరో, దర్శకుడు, హీరోయిన్ ముగ్గురి రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు బడ్జెట్ దాటితే వాటిని పరిశీలించి దానికి అదనంగా టికెట్ రేటు ఎంత వసూలు చేసుకోవచ్చనే నిర్ణయంపై జీవోలోనే పొందుపర్చడం జరిగిందన్నారు.