For Money

Business News

మార్కెట్‌ పది శాతం పడొచ్చు

మార్కెట్‌ ప్రస్తుత స్థాయి నుంచి పది శాతం పడే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌, హెలియస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు సమీర్‌ అన్నారు. కన్జూమర్‌ గూడ్స్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… బ్యాంకులు రాణిస్తాయని… అయితే తను మాత్రం ఇటీవల భారీగా క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లను కొనేందుకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లలో యాక్టివ్‌ ఫండ్స్‌ అమ్ముతున్నారని… ఈటీఎఫ్‌లు ఏవీ అమ్మడం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది ఫెడరల్‌ రిజర్వ్‌ ఏడుసార్లు వడ్డీ రేట్లు పెంచుతానని పేర్కొంది. ఇవాళ తొలి కోతతో మొదలు పెట్టింది. అన్ని వడ్డీ రేట్ల పెంపును మార్కెట్‌ ఇంకా డిస్కౌంట్‌ చేయలేదని ఆయన అన్నారు. రానున్న 30 నుంచి 45 రోజులు మార్కెట్‌లో తీవ్ర ఆటుపోట్లు ఉంటాయని సమీర్‌ అరోరా అభిప్రాయయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాలో లాక్‌డౌన్‌ ప్రభావం ప్రపంచ వృద్ధి రేటుపై ప్రభావం ఉంటుందని అన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలు కనీసం రెండు, మూడు ఏళ్ళు ఉంటాయని సమీర్‌ చెప్పారు.