For Money

Business News

వాల్‌స్ట్రీట్‌.., అదే దూకుడు

మరికొన్ని గంటల్లో వాల్‌స్ట్రీట్‌ వడ్డీ రేట్లపై కీలకం తీసుకున్న సమయంలో వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో ముందుకు సాగుతోంది. నాస్‌డాక్‌ 2.7 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.7 శాతం, డౌజోన్స్‌ 1.17 శాతం చొప్పున లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరప్‌ మార్కెట్లు కూడా ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇవాళ ప్రపంచ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉండటం విశేషం. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న అంచనాతో డాలర్‌ భారీగా క్షీణించింది. ఇపుడు 0.48 శాతం నష్టంతో డాలర్‌ ఇండెక్స్ 98.57 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బ్రెంట్‌ కూడా కాస్త బలహీనంగా ఉంది. WTI క్రూడ్‌ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఇక బులియన్‌ ధరలు కూడా ఇవాళ ఒక శాతం వరకు తగ్గాయి.