డబుల్ జోష్‌తో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్ల ఉత్సాహంతోపాటు ఆసియా మార్కెట్ల ఉత్సాహంతో సింగపూర్ నిఫ్టి డబుల్ జోష్‌తో ఉంది. నిన్న 175 పాయింట్లు నిఫ్టి నష్టపోగా, ఇవాళ ఉదయం సింగపూర్ నిఫ్టి 266 పాయింట్లు అంటే 1.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. షాంఘై సూచీ తప్ప మిగిలిన చైనా మార్కెట్లు కూడా ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. అయితే హాంగ్‌సెంగ్ 2.7 శాతం లాభంతో ట్రేడ్ కావడం విశేషం. అలాగే జపాన్ నిక్కీ కూడా 1.69 శాతం లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు చాలా స్వల్పంగా ఉన్నందున… నిఫ్టి కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.