For Money

Business News

జబర్దస్త్ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

నిన్న ఉదయం యూఎస్‌ ఫ్యూచర్స్‌ లాభాల్లో… మిడ్‌ సెషన్‌ నష్టాల్లో… తీరా మార్కెట్‌ ప్రారంభమయ్యే సరికి గ్రీన్‌లో. రాత్రి ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ పెరిగిన లాభాలు. వెరశి భారీ లాభాలతో రాత్రి వాల్‌స్ట్రీట్‌ ముగిసింది. ఇవాళ వడ్డీ రేట్లపై అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్‌ నిర్ణయాన్ని ప్రకటించనుంది. పావు శాతం వడ్డీ రేటు పెంచుతారని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే జరిగితే మార్కెట్‌ భారీగా పెరిగే అవకాశముంది. ఎందుకంటే ఈ పెరుగుదలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్ చేసింది. అయితే భవష్యత్‌ వడ్డీ రేట్ల పెంపు గురించి ఫెడ్ ఏం చెబుతుందనేది ఇపుడి కీలకం. ఇక రాత్రి మార్కెట్‌ విషయానికొస్తే ఇటీవల భారీగా తగ్గిన టెక్‌ షేర్లకు గట్టి మద్దతు లభించింది. యాపిల్ రెండు శాతం, మైక్రోసాఫ్ట్‌ 3 శాతం చొప్పున పెరిగాయి. నివిడా, ఏఎండీ షేర్లు కూడా లాభపడ్డాయి. క్రూడ్‌ ధరలు తగ్గిన కారణంగా వలెరొ ఎనర్జి, ఎక్సాన్‌ మొబిల్‌, బేకర్‌ హూస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇక ఎయిర్‌లైన్‌ షేర్లలో యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ షేర్లు 8 శాతంపైగా లాభపడ్డాయి. వెరశి నాస్‌ డాక్‌ 2.92 శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 2 శాతం, డౌజోన్స్‌ కూడా 1.8 శాతం చొప్పున లాభపడ్డాయి.