డే ట్రేడింగ్… ఈ రెండు షేర్లు
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన అమిత్ త్రివేది రెండు షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక పాఠకుల కోసం ఆయన ఈ రెండు షేర్లను సిఫారసు చేశారు. నిఫ్టి గురించి ఆయన ప్రస్తావిస్తూ… మార్కెట్లో అనిశ్చితి నెలకొందని అన్నారు. నిఫ్టి 16,420 ప్రాంతంలో మార్కెట్‌కు కాస్త మద్దతు లభించే అవకాశముంది. అలాగే నిఫ్టిలో భారీ ర్యాలీ రావాలంటే మాత్రం 16800 ప్రాంతాన్ని దాటాల్సి ఉందని అమిత్ త్రివేది అంటున్నారు. ఇక త్రివేది సిఫారసు చేసిన షేర్లు ఇవి.
ప్రికాల్ లిమిటెడ్ షేర్‌ను రూ. 115 ప్రాంతంలో కొనుగోలు చేయాలని అమిత్ త్రివేది సిఫారసు చేస్తున్నారు. జనవరిలో గరిష్ఠ స్థాయిని తాకిన ఈ షేర్ ..ఆ స్థాయి నుంచి 28 శాతం క్షీణించింది. ఇపుడు మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 107 స్టాప్‌లాస్‌తో రూ. 132ల టార్గెట్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. ఇక ఆయన సిఫారసు చేసిన మరో షేర్ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్. ఈ షేర్‌ను రూ. 700-710 మధ్య కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్ టార్గెట్ రూ. 770 కాగా, స్టాప్‌లాస్ రూ. 675.కొన్ని నెలల నుంచి నష్టాల్లో కొనసాగుతున్న ఈ షేర్‌కు వెంటనే రూ. 680-రూ. 690 ప్రాంతంలో మద్దతు లభించవచ్చని ఆయన అంటున్నారు.