డిసెంబర్‌కల్లా నిఫ్టి 20,000స్థాయికి
2020 మార్చి దిగువస్థాయిలో మొదలైన బుల్ రన్ కొనసాగుతోందని… అయితే జులై -ఆగస్టు నెలకల్లా ఓ కరెక్షన్ రావడం ఖాయమని క్యాష్దకెవోస్ డాట్ కామ్‌కు చెందిన జయ్ బాలా హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) చెందిన నవీన్ కులకర్ణి అంటున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళు ఉన్నా… భారత స్టాక్ మార్కెట్ చాలా పటిష్ఠంగా ముందుకు సాగుతుందని అంటున్నారున నవీన్. కంపెనీల ఫలితాల్లో మరీ అధిక తేడాలు ఉండకపోవచ్చని అన్నారు. చాలా తక్కువ స్థాయిలో ఉంటాయని పరిగణనలోకి తీసుకున్నా… ఆకర్షణీయ ఫలితాలు ఉంటాయని ఆయన అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా నిఫష్ట్ర్టి 20,000 స్థాయికి చేరుతుందని అన్నారు. ఇన్వెస్టర్లు కమాడిటీ మార్కెట్‌ను మర్చిపోరాదన్నారు. మెటల్స్, మైనింగ్ రంగానికి చెందిన షేర్లు కూడా రాణిస్తాయని అన్నారు. ఆగ్రికమాడిటీస్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. చక్కెర్లు ఇంకా పెరుగుతాయని అన్నారు. స్వల్ప కాలంలో బ్యాంకులు పడినా… ఈ ఏడాది బ్యాంకింగ్రంగం షేర్లు కూడా రాణిస్తాయని నవీన్ అంటున్నారు. అయితే టాప్ బ్యాంకులపై దృష్టి పెట్టడం మంచిది. ఆటో రంగానికి సవాళ్ళు ఎదురవుతాయి. ముడి పదార్థాల వ్యయం పెరగడం, అలాగే డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను సరఫరా చేయలేకపోవడం మరో కారణంగా చెప్పారు. అయితే బజాజ్ ఆటో పెరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఇది తక్కువ పీఈ స్టాక్ అని పేర్కొన్నారు. మారుతీ కూడా బాగా రాణించవచ్చు.