సెబీ వద్ద సవరించిన ఎల్ఐసీ ప్రాస్పెక్టస్
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద సవరించిన ప్రాస్పెక్టస్‌ను ఎల్ఐసీ దాఖలు చేసింది. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌కు సెబీ ఇది వరకే ఆమోదం తెలిపింది. ఈసారి పూర్తి వివరాలతో అంటే ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తున్నారు? ధర శ్రేణి ఏది? పాలసీదారులకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? రీటైల్ ఇన్వెస్టర్లకు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తున్నారు … వంటి అన్ని వివరాలను సవరించిన ప్రాస్పెక్టస్‌లో పొందుపర్చారు. సెబి నుంచి అనుమతి రావడం లాంఛనప్రాయమే. అయితే పబ్లిక్ ఆఫర్ ప్రారంభించేందుకు కోసం తగిన సమయం కోసం ఎల్ఐసీ ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనౌతున్నాయి. దీంతో ముందు అనుకున్న తేదీకి పబ్లిక్ ఆఫర్ రావడం లేదు. ఎల్ఐసీలో 5 శాతం షేర్లను అంటే 31.6 కోట్ల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 60,000 కోట్లను సమీకరించాలని ఎల్ఐసీ భావిస్తోంది.