స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. ఓపెనింగ్‌లో 16,082 పాయింట్లను తాకిన నిఫ్టి 15,990ని తాకింది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల నష్టంతో 15999 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ వొలటాలిటీ చూస్తు… మార్కెట్ స్థిరంగా ఉన్నట్లే. బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఈ సూచీల ఒత్తిడి కారణంగానే నిఫ్టి నష్టాల్లో ఉందనిపిస్తోంది. మరోవైపు నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ నిఫ్టి సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ఉండటం విశేషం. ఓఎన్‌జీసీ ఇవాళ కూడా టాప్ 5 గెయినర్స్‌లో ఉంది. క్రూడ్ మళ్ళీ 132 డాలర్లకు చేరడమే దీనికి కారణం.