నిలకడగా వాల్‌స్ట్రీట్
ఆరంభంలో నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ ఇపుడు నష్టాలను పూడ్చుకుని క్రితం స్థాయిల వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీల కాస్సేపు గ్రీన్‌లో… కాస్సేపు రెడ్‌లో ఉంటున్నాయి. యూరో మార్కెట్లన్నీ నష్టాలను పూడ్చుకుని గ్రీన్‌లోకి వచ్చాయి. లాభాలు నామమాత్రంగానే ఉన్నా… గ్రీన్‌లో ఉండటం ఇన్వెస్టర్లకు కాస్త ఉపశమనం కల్గించే అంశం. అయితే వాల్‌స్ట్రీట్ ఏక్షణమైనా నష్టాల్లోకి జారుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం… ఇవాళే రష్యా క్రూడ్ ఆయిల్‌ను అమెరికా నిషేధించే అవకాశముంది. ఇప్పటికే క్రూడ్ ధరలు అధికంగా ఉన్నాయి. మరింత పెరిగితే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకునే అవకాశముంది. దీంతో సూచీలు నష్టాల్లో ముగిసే అవకాశముంది. మరి మార్కెట్ ముగిసేలోగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన చేస్తారేమో చూడాలి.